Monday, 14 September 2026 12:01:49 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Date : 29 January 2026 10:24 PM Views : 183

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చి దిద్దాలని , ప్రతి భూ కమతానికి సరైన నక్షను,మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులు నమోదు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం కోసం గురువారం మెదక్ మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీ అయిన పాషాపూర్ లో బుధవారం గ్రామసభ నిర్వహించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వేకోసం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నగేష్, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూభూ భారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యల పరిష్కారంఅవుతుందని తెలిపారు. పాషాపూర్ గ్రామంలో భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడనికి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కగా భూ హద్దులు, భూమి యొక్క నక్ష, మ్యాప్ లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమే అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూడడమే దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. డిజిటల్ సర్వే తో హద్దుల నిర్ణయించి, అక్షాంశ రేఖాంశాలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే తో భూ హద్దులు చెరిగి పోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉంటుందన్నారు. ఈ రీసర్వే అనంతరం రైతులు భూమిని ఎక్కడకు వెళ్లిన లేదా విదేశాల్లో సైతం తన భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. తర్వాత రోజుల్లో ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూ భారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న భూములాన్ని రీసర్వే చేసి భూమి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :