ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని పాత పెట్రోల్ బంక్ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలను వాహనాదారులు పాటించడం లేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పనిచేసినప్పటికీని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలతో పాటు పలుచోట్ల చౌరస్తాల నుంచి రోడ్డు పైకి వాహనాలు చేరే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెద్ద ఎత్తున వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీని వాహనదారులకు అవగాహన లేక సిగ్నల్స్ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించి వాహనదారులు సిగ్నల్స్ పాటించే విధంగా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సురేష్ కోరారు.
Admin
E Nivas News