ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షెట్టిపేట పట్టణం హనుమాన్ కళ్యాణ మండపంలో మంగళవారం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల హనుమాన్ దీక్షా పరులు ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ (భిక్ష) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం దీక్షా స్వాములకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య (లక్షెట్టిపేట), శ్రీనివాస్ (దండేపల్లి), మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు. *పాదయాత్ర చేస్తున్న భక్తులకు పండ్లు మజ్జిగ పంపిణీ... మంచిర్యాల జిల్లా నుండి కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి పాదనడకన వెళుతున్న హనుమాన్ స్వాములకు ఉత్కూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాందేని చిన్న వెంకటేశ్ నాయకులతో కలిసి పండ్లు మజ్జిగ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.
Admin
E Nivas News