Sunday, 13 September 2026 12:51:30 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రజల వద్దకే సుపరిపాలన…/ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా దర్బార్...

మంత్రి ధనసరి అనసూయ సీతక్క

Date : 25 June 2026 11:55 PM Views : 86

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజల వద్దకే సుపరిపాలన అందించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి తన సరి అనసూయ సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక *ప్రజా దర్బార్* కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల పరిధిలోని అక్కినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, రాజుపేట, కత్తిగూడెం, నిమ్మగూడెం, దోమెడ, రామచంద్రునిపేట, వాడేగూడెం,రమణక్కపేట, చుంచుపల్లి, వాగుడుగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు తమ సమస్యలతో పాటు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.61 వేల కోట్లకు పైగా సహాయం అందించామని తెలిపారు. గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు మాత్రమే అందిన వడ్డీలేని రుణ పరిమితిని ప్రస్తుతం రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని, పాడి కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ మహిళలు సంఘాలుగా ఏర్పడి కలిసి పనిచేస్తే కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల వద్దకే పరిపాలనను తీసుకువెళ్లడం ప్రత్యేక ప్రజా దర్బార్ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తును పరిశీలించి, వాటి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో ఇండ్లను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రజలకు సులభంగా దరఖాస్తులు అందించే విధంగా ప్రత్యేక ఫార్మాట్ రూపొందించామని తెలిపారు. గ్రామాల వారీగా అందుతున్న దరఖాస్తుల ద్వారా స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, పరిష్కార చర్యలు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.ప్రతి దరఖాస్తును నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి, పరిష్కార స్థితిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తామని, సమస్య పరిష్కారం కాకపోతే కారణాలను కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ యస్ పి మనన్ భట్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి., సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ యస్ పి మనన్ భట్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి., సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :