Tuesday, 28 July 2026 11:40:22 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కుమార్ దీపక్

Date : 01 December 2025 08:09 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు ఎన్నికల అధికారి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, నోడల్ అధికారి శంకర్ లతో కలిసి 1వ విడత, 3వ విడత స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, ఏర్పాట్ల పరిశీలన, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున అవసరమైన ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అధికారులు, సిబ్బందికి ఏర్పాట్లను పర్యవేక్షించాలని తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల ఎంపిక,పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ,పోలింగ్, కౌంటింగ్ సమయంలో పాటించవలసిన నియమాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల బాధ్యత ఉంటుందని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు,సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కౌంటింగ్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా,పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ,ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.మాస్టర్ ట్రైనర్లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు హరి ప్రసాద్, మధు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :