Wednesday, 17 June 2026 01:29:25 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం…

ఉప ముఖ్యమంత్రి, మంత్రి మల్లు భట్టి విక్రమార్క

Date : 15 June 2026 07:42 AM Views : 39

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి సంస్థసర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పరిశీలనలోభాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, సింగరేణి సి ఎం డి బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్లు, సింగరేణి కార్మిక సంఘం ప్రతినిధి జనక్ ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, బొగ్గు నిల్వ ప్రదేశాలు, రికార్డులు పరిశీలించడం జరిగిందని తెలిపారు. కార్మికులు శ్రమ, చెమట తో బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థను అభివృద్ధి చేయడమే కాకుండా దేశానికి వెలుగులు అందిస్తున్నారని, వారి ఆత్మ గౌరవం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వీటిని అపహాస్యం చేస్తూ కొంత మంది అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, ఇందులో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి రావాలని తెలిపారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగా అభివృద్ధిలో భాగంగా జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో నవీకరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుండి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి పిల్లల విద్యకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.సింగరేణి కార్మికులకు 1 కోటి 25 లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పించడం జరిగిందని, సింగరేణి కార్మికుల పిల్లలకు యు.పి.ఎస్.సి. పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు, సంబంధిత శాఖల అధికారులు, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :