ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె. సంధ్యారాణి డాక్టరేట్ (పీహెచ్.డి.) పట్టా పొందారు. ఆమె శ్రీ కృష్ణ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రం విభాగం లో డాక్టరేట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.డా. విజయ్ కుమార్ చతుర్వేది పర్యవేక్షణలో ఆమె "తూర్పు మరియు పశ్చిమ తెలంగాణ రాజకీయ పార్టీలలో మహిళా సాధికారతపై ఒక అధ్యయనం అనే అంశంపై పరిశోధన నిర్వహించి పీహెచ్.డి. పట్టా అందుకున్నారు. సమకాలీన సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో మహిళల రాజకీయ భాగస్వామ్యం, సాధికారత, రాజకీయ పార్టీలలో వారి పాత్ర వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషిస్తూ చేసిన ఈ పరిశోధన విద్యా, సామాజిక వర్గాల మేధావులు ప్రశంసించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సహచర సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు డా. కె. సంధ్యారాణిని అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని విద్యా పరిశోధనలు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News