Monday, 14 September 2026 01:21:10 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు

Date : 04 December 2025 12:47 AM Views : 251

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించడం జరిగిందని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సేవల అత్యవసరతకు లోబడి ఆ రోజు కార్యాలయానికి ఆలస్యంగా హాజరు కావడం, కార్యాలయం నుండి త్వరగా వెళ్లడం, తక్కువ వ్యవధి గైర్హాజరు విధానాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. ఎన్నికల కోసం ఉపయోగించబోయే ప్రజా భవనాలు, విద్యా సంస్థల భవనాలు, ఇతర భవనాలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు , పోలింగ్ రోజుకు ముందు రోజు స్థానిక సెలవుగా పరిగణించబడుతుందని, దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాలకు ఈ నెల 10వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 11వ తేదీ (పోలింగ్ రోజు), బెల్లంపల్లి, భీమిని, కన్నేపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాలకు ఈ నెల 13వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 14వ తేదీ (పోలింగ్ రోజు), భీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి, మందమర్రి మండలాలకు ఈ నెల 16వ తేదీ (పోలింగ్ ముందు రోజు స్థానిక సెలవు దినం), 17వ తేదీ (పోలింగ్ రోజు) లలో సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్రకటించిన ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/సంస్థల ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించబడిందని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న సంబంధిత అధికారులు, ప్రభుత్వ,ప్రైవేట్ వ్యాపార సంస్థలు, పరిశ్రమ యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పై పేర్కొన్న రోజులను వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: