ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సామాజిక సేవలో సావిత్రిబాయి పూలే అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన బి శ్రీ లాలిత్య హెచ్ ఇ సి ఫస్ట్ ఇఇయర్, శ్రీనిధి ఎంపీసీ సెకండ్ ఇయర్, కె అభినయ హెచ్ఈసి సెకండియర్ విద్యార్థినులను మాజీ జెడ్పిటిసి మూల సరోజన రెడ్డి శాలువాతో సన్మానించి మెమొంటోలు ప్రధానం చేసి మహిళ అధ్యాపకులు కే ఝాన్సీ, ఎం శ్రీదేవి, సబితా, మౌనికలను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా మూల సరోజన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని సంఘసంస్కర్త కవయిత్రి మహిళలకు చదువు నేర్పిన చదువుల తల్లి అని పేర్కొన్నారు. అనేక పాఠశాలలు నెలకొల్పి మహిళలకు విద్యను అందించారని వితంతు వివాహాలను ప్రోత్సహించారని బాల్య వివాహాలను రూపుమాపారన్నారు. అనాధ ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేసిన గొప్ప మానవతావాది అని, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ఆమె బాటలో నడవాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ జేఏసీ నాయకుడు బెజ్జంకి. డి గంబర్ కళాశాల లెక్చరర్స్ బి శ్రీధర్ రావు, ఆర్ తిరుమల్, ఎల్ఆర్కే రాజేశ్వరరెడ్డి, సిహెచ్ నగేష్ లతోపాటు విద్యార్థినులు పాల్గొన్నారు.
Admin
E Nivas News