ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మకర సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకొని మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీలో బుధవారం మూల సరోజన పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల సరోజన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే ముగ్గులతో మన ముంగిల్లు కళకళలాడుతాయన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంక్రాంతి పండుగ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించడం మన సాంప్రదాయమన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగు రంగుల ముగ్గులు ఇంటి ముందట వేస్తారని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపి గెలుపొందిన విజేతలను అభినందించారు. పోటీలలో 25 మంది మహిళలు పాల్గొని వేసిన వివిధ రకాల రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఓడ్నాల ప్రవళిక శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రథమ బహుమతి కొమురోజు సరిత, ద్వితీయ బహుమతి చేమంతుల శ్రీవాణి, తృతీయ బహుమతి ఎస్ మనస్విలకు బహుమతులు ప్రధానం చేశారు. అంతేకాకుండా పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Admin
E Nivas News