ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పెఱిక కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని పెఱిక సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్ కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా పెఱిక సంఘం ఆధ్వర్యంలో లక్షేటిపేట పట్టణంలోని స్థానిక గుడ్ షేఫర్డ్ పాఠశాలలో 2026నూతన సంవత్సర క్యాలెండర్ ను అయన ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులు, ఉప సర్పంచులు గా గెలిచిన పెరిక కుల నాయకులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘం నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పెరిక కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని, పెరికకుల సంఘ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బొడ్డు శంకర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెరిక కులస్తులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News