ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం క్రికెట్ ఆటలో తర్ఫీదు పొందుతున్న యువ క్రికెటర్లు ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆదర్శ్ నగర్లో గల కపిల్ క్రికెట్ గ్రౌండ్ పార్క్ కోసం కోటి రూపాయల నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఈ గ్రౌండ్ విషయంలో క్రికెటర్ల సలహాలు సూచనలను స్వీకరించడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.
Admin
E Nivas News