Friday, 19 June 2026 01:10:23 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, ఫోన్లో డౌన్లోడ్ చేసిన కఠిన చర్యలు తప్పవు....

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...

Date : 20 February 2026 11:10 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, వాటిని మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం, ఆన్లైన్ బ్రౌజర్స్ ద్వారా వీక్షించడం, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, ఫార్వార్డ్ చేయడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరమని, వీటిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం లేదా గూగుల్‌లో వాటి కోసం వెతకడం వంటి చర్యలను జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని, దీనికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠినమైన పోక్సో కేసులు చేయబడతాయని హెచ్చరించారు. పోర్న్ వీడియోలు చూడటం, వాటిని తయారు చేయడం, వాటిక వెతకడం మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం వంటి కార్యకలాపాలు సమాజంలో అసభ్యతను వ్యాప్తి చేయడమే కాకుండా, మహిళలు మరియు పిల్లల గౌరవాన్ని దిగజారుస్తాయి. అంతేకాకుండా, ఇది సైబర్ నేరాల పరిధిలోకి వస్తుంది సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన శిక్షార్హమైన చర్యలకు దారితీస్తుంది. జిల్లాలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ ద్వారా నిందితులను గుర్తించి, వారిపై తగిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇదివరకే ఆదిలాబాద్ జిల్లా నందు ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వయసు పైబడిన వారు చైల్డ్ పోర్న్ చూస్తూ కేసుల పాడవడం జరిగిందని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. పిల్లల పై జరుగు అత్యాచార వీడియోలను చూస్తే హైదరాబాద్ "చైల్డ్ టిప్ లైన్" వారూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిం చాలన్నారు. ఇటువంటి తప్పుదోవ పట్టించే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నిఘా ఉంచాలని, వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా పోలీసు శాఖ ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉందని, ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: