ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టీసీ యాజమాన్యం ఇవి ఆటోలను ఇవ్వాలి అనే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఐబి చౌరస్తా లో ఉన్న ఆటో కార్మికులు, ఆటో జేఏసీ నాయకులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ తర్వాత ఆటో రంగమే లక్షలాది మందికి రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా జీవనోపాధి కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని ఈ రోజు ప్రతి మారుమూల గ్రామాల, పట్టణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ లక్షలాది మంది ఆటోల ద్వారా జీవనోపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నా రన్నారు.ఇలా రోజువారిగా ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికి నేటి వరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సం,, 12వేలు ఇవ్వాలి. నేటికి 2 ఏండ్లు గడిచిన అమలు చేయలేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన యాక్సిడెంటల్గా ఆటో డ్రైవర్ చనిపోయినా వారి కుటుంబానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఆటో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ఆ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏలాంటి సహాయ సహకారాలు లేవు. ఆటో డ్రైవర్లు కేవలం వారి జీవనభృతి కోసం కాకుండా రాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రజలు ఇచ్చిన డబ్బులతోనే జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం వలన ఆటో, క్యాబ్, లారీ, డిసిఎం లాంటి మోటార్ కార్మికులకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ సంక్షేమ బోర్డు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఏలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. వాస్తవంగా సంక్షేమ బోర్డుకు ఆటోలు కొన్నా, క్యాబ్లు కొన్నా, లారీలు కొన్నా, డిసిఎంలు కొన్నా అనేకమైన వాహనాలపై కొత్తగా కొనుగోలు చేసే సందర్భంలో 2% సెస్సు కనుక వసూలు చేసినట్లయితే కోట్లాది రూపాయలు ఈ సంక్షేమ బోర్డుకు నిధులు వస్తాయి. అదే విధంగా కార్మికుల నుండి సభ్యత్వ రుసుము వసూలు చేసి నమోదు చేసి లక్షలాది మంది సభ్యులుగా చేర్చు కోవచ్చన్నారు. ఈ సంక్షేమ బోర్డు వలన రవాణ రంగంలో ఉన్న కార్మికులందరికి భరోసాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఓలా, ఊబర్, రాపిడో యాప్ల ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లను అవసరమైన మేరకు యాప్ల వారు ఇష్టం వచ్చినట్లు కమీషన్లు దండుకుంటున్నారు. ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలన్నారు. ఆర్టీసీయాజమాన్యానికి రాష్ట్రంలో నడుస్తున్న ఈ.వి. ఆటోలను ఏర్పాటు చేయటం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టటమే అవుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టటం వలన వేలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోవటం జరిగింది. ఆర్టీసీకి అవసరం అనుకుంటే ఇప్పుడున్న ఆటో డ్రైవర్ల వద్ద ఉన్న ఈ.వి. ఆటోలను తీసుకొని ప్రజారవాణా కోసం ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. దీని వలన చాలా మందికి ఆటో డ్రైవర్లకు ఆన్యాయం చేసినవారు అవు తార అన్నారు. కావున వెంటనే ఆర్టీసీ ఈ.వి. ఆటోల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవా లన్నారు. అదే విధంగా ఈ క్రింది తెలిపిన సమస్యల పరిష్కారం కోసం 2026 ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఆటో డ్రైవర్ల నిరవధిక బంద్ లో కార్మికులు, ప్రజాస్వామిక వాదులు,విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు అందరూ సహకరించగలరని జయప్రదం చేయాలన్నరు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News