ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులకు సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మవాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెంలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మంథని పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఆయా వార్డుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News