ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ మరియు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయి 54 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మండల మహిళ సంఘాలకు రూ. 3,03,00,000/- ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఎవరు అధైర్యపడొద్దని ఊరి బిడ్డగా అందరికి అండగా ఉంటానని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News