Saturday, 12 September 2026 09:27:09 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి నమస్తే..

Date : 07 August 2026 09:00 PM Views : 92

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న నేతన్నల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి నమస్తే అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. శుక్రవారంజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగం అభివృద్ధికి, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత కళ బతుకుతుందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోసిందని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి హామీలను మరిచి, ఆ పథకాలన్నింటినీ నిలిపివేసి నేతన్నల జీవితాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మగ్గాలు మూగబోతున్నాయని, కార్మికుల్లో వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి బట్ట నేసి ఇచ్చే చేతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా స్పందించి చేనేత రంగాన్ని తక్షణమేఆదుకోవాలని, కార్మికులకు భరోసా కల్పిస్తూ చేనేత రంగానికి పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేతన్నను కాపాడుకుందాం, చేనేతను బతికించుకుందాం అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: