ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శనివారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందచేశారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హర్కర వేణు గోపాల్ , బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ,జనక్ ప్రసాద్ , డీసీపీ , జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం
Admin
E Nivas News