Sunday, 13 September 2026 12:57:56 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం చర్చ..

Date : 26 March 2026 11:10 PM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు మేము పెండింగ్ లో పెట్టలేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపా రు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రూ"627 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెట్టిందని అన్నారు. అందులో రూ 240 కోట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ"360 కోట్లు ప్రవేట్ ఆస్పత్రులకు బకాయిలు ఉందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంపై కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ బకాయిలను మోస్తూనే, పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వ రెండు కళ్ళని, ఈ రంగాలకు నిధుల కోత విధించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ బకా యిలపై స్పష్టత ఆరోగ్య శ్రీ చెల్లింపులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం తిప్పికొట్టారు. డిసెంబర్ 2023 నాటికి ఉన్న రూ.627 కోట్ల పెండింగ్ బకాయిల భారాన్ని తమ ప్రభుత్వం స్వీకరించిందని, ఇప్పటివరకు రూ.2,408 కోట్లను ఆరోగ్య శ్రీ కోసం చెల్లించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రుల కు రూ.1,480 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం కేవలం రూ.727 కోట్లు మాత్రమే బకాయి ఉన్నాయని, చెల్లింపులు నిరంతరం జరుగుతున్నా యని వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో పారదర్శకత గతంలో సీఎంఆర్‌ఎఫ్, చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని తెచ్చి అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్నారు. ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.2,046 కోట్లు అందించామని, ఆరోగ్య శ్రీతో కలిపి మొత్తం రూ.4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలోని 35 మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీచింగ్ ఆసుపత్రుల పర్యవేక్షణను గ్రూప్-1 స్థాయి అధికారికి అప్పగించాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలిపారు. గోషామహల్‌లోని 30 ఎకరాల్లో రూ.3,000 కోట్లతో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని, దీనివల్ల అదనంగా 10 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ కేంద్రాలుగా మారుస్తామన్నారు. ప్రవాస డాక్టర్ల కోసం ప్రత్యేక వెబ్ సైట్ విదేశాల్లో స్థిరపడిన తెలుగు డాక్టర్ల సేవలను వినియోగించుకునేందుకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడి ఆసుపత్రుల్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, కులగణన ఆధారంగా కోటి15లక్షలకుటుంబాలకు 'ఇందిరమ్మ జీవిత బీమా' కల్పించి ప్రతి కుటుంబానికి ధీమా ఇస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :