ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో, రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.జిలానీ బి & రెయిన్బో ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ శేషు కుమార్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన 45 రోజుల ఉచిత కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ, యువకులకు సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, తదితరులు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, తదితర వక్తలు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా ఇటువంటి స్వయం ఉపాధి శిక్షణలు తీసుకొని, సొంతంగా జాబ్ వర్కు చేసుకుంటే జీవనోపాధి పొందవచ్చు అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కంప్యూటర్, టైలరింగ్ వర్కులు ఎంతగానో మనకు ఉపయోగపడతాయన్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా ఇటువంటి ఉచిత స్వయం ఉపాధి శిక్షణలో ఇస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాజు, మోహన చౌదరి, పర్వీన్, ఆశాభి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువతీ, యువకులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News