Tuesday, 28 July 2026 07:39:51 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

60,000లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఈఈ, ఏఈ…

Date : 17 July 2026 08:34 AM Views : 70

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఏసీబీ అదికారులు అవినీతి అధికారల ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు గురువారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పౌల్ట్రీ ఫామ్‌ ఏర్పాటు కోసం నీటిపారుదల శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ( ఎన్ఓసి) కోసం దరఖాస్తుచేసుకున్నాడు. కాగా ఎన్‌వోసీ ఇవ్వడానికి నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ రమేశ్‌లు బాధితుడిని రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం డబ్బులు బాధితుడు బతిమిలాడడంతో చివరకు 60,000, ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది ఇక లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖఅధికారుల ను ఆశ్రయించాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడిచేశారు.ఆదిలాబాద్‌లోని నీటిపారుదల శాఖకార్యాలయంలోనే బాధితుడి నుంచి ఈఈ విఠల్, ఏఈ రమేశ్ రూ.60 వేల నగదుతీసుకుంటుండగా అధికారులు మెరుపుదాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రికార్డులను పరిశీలిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :