Sunday, 13 September 2026 01:06:17 AM
# దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్

బిఆర్ఎస్ బిజెపి పార్టీ లు రెండు ఒకటైనా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోలేవు...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 08 February 2026 11:31 PM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ / భూపాలపల్లి ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్‌ను అడ్డుకోలేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల వైఖరిపై నిప్పులు చెరిగారు. “ గత 10 ఏళ్లలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు. ఎవరికైనా ఇల్లు వచ్చిందా? ఆయనకు మాత్రం ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ వచ్చింది, ఆయన కొడుక్కి, అల్లుడికి, బిడ్డకు ఫామ్ హౌస్‌లు వచ్చాయన్నారు. పేదల పట్ల ప్రేమ లేదు కాబట్టే గ్రామాల్లో ఇళ్లు కట్టలేదు” అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’అని, చేసిన పాపాలు ఊరికే పోవని, ఆ ఊబిలోనే వాళ్లు కూరుకుపోతారని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తనను ‘రేవంత్ ఉద్దీన్’ అని పిలిచినా తనకు బాధ లేదని, తాను అందరి వాడినని పేర్కొన్నారు. అయితే, కిషన్ రెడ్డి ‘కల్వకుంట్ల కిషన్ రావు’గా మారి కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ కేసులతో వేధించిన బీజేపీ, లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతోందని నిలదీశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా జర్నలిస్టులను, జడ్జీలను బ్లాక్ మెయిల్ చేసిన సన్నాసుల మీద చర్యలు ఎందుకు లేవని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ.. “గల్లీలో మోరీ తీయాలంటే కేసీఆర్ వస్తాడా? లైట్ వేయాలంటే మోడీ ఢిల్లీ నుంచి వస్తాడా? పెళ్ళి చేసేటప్పుడు పెళ్లి పెద్దని చూసి పిల్లని ఇస్తామా, పిల్లగాడిని చూసి ఇస్తామా?” అని చమత్కరించారు. మన గల్లీలో ఉండి పని చేసే గండ్ర సత్యనారాయణ లాంటి వారిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీలకు తమ ప్రభుత్వం రూ. 616 కోట్ల నిధులు ఇచ్చిందని, ఈ పనులన్నీ సజావుగా సాగాలంటే కౌన్సిలర్ తమ వాడై ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, 2027 గోదావరి పుష్కరాల కోసం బాసర నుండి భద్రాచలం వరకు ప్రతి దేవాలయాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రూ. 3,000 నుండి రూ. 4,000 కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :