ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అన్ని వర్గాల విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే సంకల్పంతోనే కేసీఆర్ జిల్లాకోక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదిలాబాద్ జిల్లాలోని ఎంఎస్ అకాడెమీలో విద్యానభ్యసించి ఇటీవల వెలువడిన నీట్ లో ప్రతిభ కనబరిచిన 23 మంది మైనార్టీ విద్యార్థినీలకు శనివారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరపున అభినందన కార్యక్రమం ఓ మాజీ మంత్రి జోగు రామన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ హమ్ తుమారే సాత్ హై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసి అన్ని వర్గాల విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే ముందుచూపు ఉన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సీనియర్ నాయకులు సాజిద్ ఖాన్, యునుస్ ఆక్బాని, అయ్యుబ్, అకాడమీ సభ్యులు బిలాల్, గౌస్, రిజ్వాన్ తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News