ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో తెలుగు ఉపన్యాసాకులుగా, పరిశోధకుడిగా, కవిగా, రచయితగా, విద్య సేవ కార్యక్రమాలు, సాంఘిక సేవలు చేస్తున్న డా. రాయలింగుకు ఏపిజె అబ్దుల్ కలాం జాతీయ అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన మొదటి కవి. ఈయన సాహిత్య రచనలు, తెలుగు భాష, సంస్కృతి, విద్య రంగంలో విశేషమైన కృషి చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. కలాం జయంతిని పురస్కరించుకొని సదరన్ ప్రయివేట్ లెక్చరర్స్, టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. రాయలింగుకు అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభ అవార్డ్ రావడం పట్ల పలువురు మిత్రులు, సహా అధ్యాపకులు అభినందించారు.
Admin
E Nivas News