Wednesday, 29 July 2026 09:22:03 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

కాళేశ్వరం పేరుతో అధికారం రుచి చూడాలనే ఆరాటం..

కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్...

Date : 09 July 2026 11:33 PM Views : 47

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం చుట్టూ జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రైతుల గోడును పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయడం లేదని ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజుల పాటు ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించండి, రైతులకు నీరందిస్తామని కేటీఆర్, తనకు ఓ మూడు నెలలు నీటిపారుదల శాఖను అప్పగిస్తే కాళేశ్వరం అంటే ఏమిటో చూయిస్తానంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రిదొంగ "తాళం చెవులు కూడా నాకే ఇవ్వండి" అన్నట్టుగా హరీశ్ రావు, కేటీఆర్‌ల కోరిక ఉందన్నారు. అధికార రుచి చూడాలనే ఆరాటం రోజురోజుకి ముదురుతుంది అన్నారు.బీఆర్ఎస్ పార్టీపై పట్టుకోసం బావబామ్మర్దుల ఆధిపత్య పోరు ఫామ్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం వరకు చేరిందని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న విషయం అగ్గిపెట్టె రావు, డ్రామారావులకు అర్థమైనట్టుందిన్నారు. అందుకే ఒకరు వారం రోజులు మరొకరు మూడు నెలలు అంటూకనీసం కాళేశ్వరం పేరుతోనైనా కొద్దిరోజులు అధికార రుచి చూడాలనే ఆరాటం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పెండింగ్ కమీషన్లు ఉన్నాయా? వాటి వసూలు కోసమేనా మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి బాధ్యత ఇవ్వండి అంటున్నారు.. ఇంత పదవి వ్యామోహమా అని ప్రశ్నించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :