ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు లోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వెట్టి చాకిరి విముక్తి కుల నిర్మూలన పీడిత వర్గ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని. అందరూ జీవించేందుకు ఉపాధి కోసం ప్రజలందరికీ భూమి కావాలని పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం సమాజంలోని ఆర్థిక అసమాన తల నిర్మూలన కొరకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.రామకృష్ణ , కార్యదర్శి చందా వారి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు సి.ధర్మయ్య లు విజ్ఞప్తి చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు రజక వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ మరియు అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి సభ జిల్లా నాయకులు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరినీ సమైక్యపరిచి హీరోచిత పోరాటం నిర్వహించిందని ఆ పోరాట ఫలితంగా మన దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల భూమి బడుగు బలహీన వర్గాలకు పంచిన పోరాటంగా నిలిచిందని ఆయన అన్నారు. అలాగే 2000 సంవత్సరములో పేద ప్రజల పైన అప్పటి పాలకులు పెంచి అమలు జరిపిన విద్యుత్తు సంస్కరణలు కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పేద ప్రజల వైపు నిలిచి ప్రాణాలర్పించిన వేగుచుక్క సత్తెనపల్లి రామకృష్ణ కి జోహార్లు అర్పిస్తున్నామని రానున్న రోజుల్లో కుల వివక్షత లేని సమాజం కోసం - మన పాలకులు ప్రజల పైన మోపుతున్న విద్యుత్ భారాలు కు వ్యతిరేకంగా పోరాటమే చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ లకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. చిట్యాల ఐలమ్మ రామకృష్ణ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఎక్కడ రజకులకు అన్యాయం జరిగిన నిలబడి పోరాడే సంఘం అని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రజకుల వైపు నిలబడి పోరాటం చేద్దామని వారు చెప్పారు. పోరాట యోధురాలు & వీరనారి చిట్యాల ఐలమ్మ మరియు అమరజీవి సత్తెనపల్లి రామకృష్ణ లకు చిత్రపటాలకు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు టి.వెంకటేశ్వరరావు, వెంకటరమణ, శివన్న మధు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News