Friday, 11 September 2026 07:39:29 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ

Date : 10 September 2026 07:42 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జెఎసి) నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో జరిగిన చర్చల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై పలు కీలక నిర్ణయాలు సాధించిన సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. నేడు ఆత్మకూరు పట్టణంలోని, పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనంలో ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాషా, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.కొండయ్య, పూర్వ అధ్యక్షుడు బి.అచ్చయ్య, ట్రెజరర్ వై.నాగప్ప, రిటైర్డ్ పశువైద్య సూపరింటెండెంట్ ఓ.మూర్తుజా లకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాషా మాట్లాడుతూ, ఏపీ ఎన్జీవోస్ మరియు జేఏసీ అనుబంధ సంఘాల నాయకులు సంయుక్తంగా కృషి చేసి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రయోజనం కలిగిందన్నారు. ప్రధానంగా పిఆర్సి కమిషన్ ఏర్పాటు, రెండు డిఎల విడుదల, అదనపు క్వాంటం పెన్షన్ పెంపు, ఒక విడత సరెండర్ లీవ్ చెల్లింపు, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు వంటి కీలక నిర్ణయాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అదనపు క్వాంటం పెన్షన్ పెంపును పునరుద్ధరించడం పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకుని 30% మధ్యంతర భృతి (ఐ ఆర్), మెరుగైన పిఆర్సి, ఆర్థిక బకాయిల విడుదల తదితర అంశాలపై నిరంతరం కృషి చేస్తామని ఏపీజెఎసి తాలూకా అధ్యక్షుడు ఎస్.సాజిద్ బాష తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :