ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యతతో ముందుకు రావాలని వ్యవస్థాపక అధ్యక్షులు పి.ఢిల్లీబాబు రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ.మద్దిలేటి లు అన్నారు. నంద్యాల పట్టణంలోని, శ్రీ రామకృష్ణ పిజి కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) నంద్యాల జిల్లా మహాసభలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఎఫ్ వ్యవస్థాపకులు & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఢిల్లీ బాబు రెడ్డి, ఏపీ ఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు & కర్నూలు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ టీ.మద్దిలేటి లు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత జర్నలిస్టుల గుర్తింపు, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక యూనియన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పి.ఢిల్లీబాబు రెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటెషన్ కమిటీలో ఇతర శాఖల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ, విలేకరుల హక్కుల కోసం హైకోర్టులో పిల్ వేసి, సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ అందరూ ఏదో ఆదాయం కోసం పని చేస్తే, కేవలం ఒక జర్నలిస్టు మాత్రమే ఆదాయం ఆలోచన లేకుండా సమాజ శ్రేయస్సు కోసం ఎటువంటి జీతం లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా మీరు అందిస్తున్న సేవలు మీరు నాలుగవ స్తంభం కాదనీ, మొదటి స్థంభంలా ఉండి, సమాజంలో జరుగుతున్న తప్పు ఒప్పులు సరి చేయడం గమనార్హం అన్నారు. కావున రానున్న రోజుల్లో జర్నలిస్టులందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటామని, టోల్గేట్ ల దగ్గర జర్నలిస్టులకు మినహాయింపు, రైల్వే పాసులు, ఇంటి స్థలాలు, బిల్డింగులు, తదితర అన్ని సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల అభివృద్ధి కొరకు మేము ఎల్లవేళలా సహకారం అందిస్తున్నామని అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం జారీ చేసిన 50 శాతం అన్ని రకాల ఫీజులు మినహాయింపు చేస్తున్నామన్నారు. ఈ మహాసభలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు కీలక డిమాండ్లను మరియు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న గుర్తింపు సమస్యలపై ఏపీఎంఎఫ్ మొదటి నుండి గళమెత్తుతోందనీ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి జర్నలిస్టులకు సరైన గుర్తింపు, రక్షణ కల్పించడమే లక్ష్యంగా యూనియన్ గా స్థాపించడం జరిగిందన్నారు. *50 సంవత్సరాలు నిండిన సీనియర్ జర్నలిస్టులకు రూ. 10వేల గౌరవ పెన్షన్ ఇవ్వాలి... పి.ఢిల్లీ బాబు రెడ్డి* జీవితాంతం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ, ప్రజల గొంతుకగా నిలిచిన సీనియర్ జర్నలిస్టుల ఆర్థిక భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రం తరహాలో వృద్ధాప్యంలో ఉన్న, 50 సంవత్సరాలు నిండిన సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ. 10,000/- రూపాయల చొప్పున గౌరవ సామాజిక పెన్షన్ అందించాలని ఏపీఎంఎఫ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, సమస్యల పరిష్కారానికి విడివిడిగా కాకుండా, జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పి.ఢిల్లీబాబు రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేసి, యాజమాన్యాలు మరియు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని రకాల హక్కులను సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ నంద్యాల జిల్లా ఏపీ ఎంఎఫ్ మహాసభకు ముఖ్య అతిథులుగా వచ్చిన బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ & సామాజికవేత్త డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, ఏపీఎంఎఫ్ వ్యవస్థాపకులు & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఢిల్లీబాబు రెడ్డి, ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు & కర్నూలు జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు టి.మద్దిలేటి లకు నంద్యాల జిల్లా కమిటీ పి.హర్షవర్ధన్ రెడ్డి, పి.శివకుమార్ రెడ్డి, సీఎం.శ్రీనివాసులు, వి.పక్కిరయ్య, తదితరులు శాలువాలు, శ్రీశైలం దేవస్థానం కండువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు చేతికి అందించి ఘనంగా సన్మానించడం చేయడం జరిగింది. అనంతరం సీనియర్ జర్నలిస్టులకు, నూతన కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, మెమొంటోలు, లగేజీ బ్యాగులు చేతికి అందించి గౌరవంగా, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. జిల్లా కమిటీ మరియు దాతల సహకారంతో రాష్ట్రంలోని, వివిధ జిల్లాల నుండి వచ్చిన విలేకరులందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వెజ్, నాన్ వెజ్ భోజనాలు, స్వీట్స్, బిస్లరీ వాటర్ బాటిళ్లు పెట్టడం జరిగింది. ఈ మహాసభకు అన్ని రకాల మంచి వసతులు కల్పించిన ప్రతి ఒక్కరికి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ పి.నాగవర్ధన్ రెడ్డి, కో కన్వీనర్ లు పి.శివకుమార్ రెడ్డి, సీఎం.శ్రీనివాసులు, యు.శివకుమార్ నాయుడు, వి.పక్కిరయ్య, ఏ.సురేష్ కుమార్, వి.జయపాల్ రెడ్డి, ఎం.సౌకట్ అలీ, ఎస్సేసు ఎస్ఎం.రఫీ, అచ్చయ్య, వై.వి.సుబ్బయ్య, చేసిన ఏపీ ఎంఎఫ్ రాష్ట్ర నాయకులు సోమశేఖర్, సురేంద్ర రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఐ.మల్లికార్జున, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యదర్శి తలారి శైలజ, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీ ఎంఎఫ్ నాయకులు ఆనంద్ కుమార్, ఏపీ ఎంఎఫ్ జిల్లా కమిటీ మెంబర్స్ సోషల్ మీడియా జిల్లా మహిళా ప్రతినిధులు నాగమణి, ఆర్.దివ్య, ఎం.ప్రియాంబ, సోషల్ మీడియా జిల్లా ప్రతినిధులు ఆల.సురేష్ కుమార్ (ప్యాపిలి), ఎస్.షర్పద్దీన్ అలి, భావన వినోద్ కుమార్, బి.స్వాములు, కే.అంకన్న, కే.మోషే, ఎస్.మహమ్మద్ రఫీ, జి.ప్రవీణ్ కుమార్, కే.నాగస్వామి నాయక్, ముద్రగడ శ్రీనివాసరావు, వై.శివారెడ్డి, ఎం.వెంకట రమేష్, రాఘవేంద్ర, మహబూబ్ బాష, డక్క.శ్రీకాంత్, రాముడు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News