ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆత్మకూరు పట్టణ పదవ వార్డు అధ్యక్షుడు ఏ.న్యామతుల్ల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరవేసే లక్ష్యంతో జూలై-27 నుంచి 45 రోజుల పాటు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ద్వారా ప్రతి ఇంటికీ వెళ్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు ప్రగతిని వివరించడంతో పాటు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ, వారి సలహాలు మరియు సూచనలను స్వీకరిస్తూ మన శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి దృష్టికి చేరుకుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు 10 వార్డ్ అధ్యక్షుడు ఏ.న్యామతుల్లా, డాక్టర్ అబ్దుల్ రషీద్, 74వ బూత్ కన్వీనర్ వి.మహబూబ్ బాష, టిడిపి వార్డు ప్రధాన కార్యదర్శి ఎం.హబీబుల్లా, 10 వార్డ్ కార్యదర్శి షేక్.అలీ కే.ఎస్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News