ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం ఇందిరేశ్వరం, శ్రీపతిరావుపేట గ్రామాల ఉమ్మడి చెరువులైన మాచవీరప్ప చెరువు, పద్మరాజ చెరువుల్లో మట్టి తోలుకునే విషయంలో వివాదం తలెత్తిందనీ అన్నారు. గతంలో ఈ రెండు గ్రామాలకు చెందిన రైతులు పార్టీలతో సంబంధం లేకుండా (వైసీపీ, టీడీపీ) అందరూ కలిసి తమ ట్రాక్టర్లతో మట్టి తోలుకునేవారు. కానీ, గత పది రోజుల నుంచి టీడీపీ నాయకులు, నీటి సంఘాల ప్రతినిధులు కావాలనే వైసీపీ వాళ్ల ట్రాక్టర్లను మట్టి తోలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై ఆయా గ్రామాల రైతుల తరపున మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ-ఆర్.రామాంజి నాయక్ కి ఫిర్యాదు చేశారు. పార్టీల ప్రమేయం లేకుండా గ్రామాల్లో ట్రాక్టర్లు ఉన్న రైతులందరికీ మట్టి తోలుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదంటే పక్షపాతంగా కాకుండా ఎవరినీ మట్టి తోలనివ్వకుండా పూర్తిగా ఆపివేయాలని వారు ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ మీర్, అంజాత్ అలీ, మోమిన్. మునీర్ భాష, తదితర నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News