ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, చెలిమిళ్ళ గ్రామంలో బి.రాణెమ్మ(45) భర్త ఏసన్న పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందడం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బి.రాణమ్మ ఉదయము పోలం పనులకు వెళ్లడం జరిగింది. ఆమెకు దాహం వేయడంతో నీళ్లు తాగడానికి బావిలో దిగుతుండగా కాలుజారి బావిలో పడడం జరిగింది. గ్రామస్తులు వచ్చి తీసేలోపే ఆమె మరణించడం జరిగింది. మృతురాలికి భర్త, ఒక్క కుమారుడు, ఒక్క కూతురు ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎస్సై పి.తిరుపాలు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్ లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు పంచనామా కొరకు పంపడం జరిగింది.
Admin
E Nivas News