ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు గ్రామ.ప్రజలు ప్రతి ఇంటి నుండి బోనం కుండల్లో నైవేద్యం తీసుకొని వచ్చిగంగమ్మకు సమర్పించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు కట్టెకు కప్పలను, వేపాకులు వేలాడదీసి, వాటికి ఇంటింటి వద్ద నీళ్లు పోసి గ్రామం మొత్తం తిరిగి బిక్షాటన చేసి, చందాలు వేసుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News