Sunday, 13 September 2026 01:40:19 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు

డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు

Date : 20 June 2026 10:15 PM Views : 376

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోనీ, వేంపెంట గ్రామంలో పునర్నిర్మిత ఆలయంలో శ్రీ సీతారామ హనుమత్ సమేత ధ్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నాకు తెలిసి, నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి మహోత్సవాన్ని ఎన్నడూ చూడలేదనీ అన్నారు. మా పూర్వీకులు నిర్మించిన శ్రీరామాలయాన్ని తిరిగి పునరుద్ధరించి, మహోత్సవాలతో పునః ప్రారంభించడం, నేను పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. సుమారు 98 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు భక్తి, శ్రద్ధలతో నిర్మించిన ఈ పవిత్ర దేవాలయంలో, నేడు భగవంతుని అనుగ్రహంతో మా అమ్మ శ్రీ కేశవ రామచంద్ర ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ టేకూరి.రామ సుబ్బమ్మ (భర్త స్వర్గీయ టేకూరి.కృష్ణుడు) ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని జరుపుకోవడం మాకు పునర్జన్మ సఫలమైనంత ఆనందాన్ని కలిగిస్తోందనీ అన్నారు. 2019 మార్చి న పునాదులు వేసిన శ్రీరామాలయం ఎన్నో ఆటంకాలు, సవాళ్లను అధిగమించి నేడు మహోత్సవ వైభవంతో నిలవడం భగవంతుని కృపకు నిదర్శనం అని అన్నారు. విశేషంగా, జూన్-17వ తేదీ మా నాన్న టేకూరి.కృష్ణుడు పరమపదించిన రోజు కావడం, అదే తేదీన ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దేవాలయ పునః ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తవడం మాకు ఎంతో భావోద్వేగభరితమైన అనుభూతిని కలిగించిందనీ, ఇది యాదృచ్ఛికం కాదు, శ్రీరాముని సంకల్పమే అని మేము విశ్వసిస్తున్నామన్నారు. 2026 జూన్-15, 16,17వ తేదీలు మా గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ మూడు రోజుల పాటు నిర్వహించిన అన్ని కార్యక్రమాలు అత్యంత ఘనంగా, భక్తి భావంతో గొప్పగా జరిగాయన్నారు. యాగాలు, హోమాలు, వివిధ పూజా కార్యక్రమాలు, చెక్క భజన, బాహుబలి హనుమాన్ శోభాయాత్ర, గ్రామోత్సవం, సంగీత విభావరి (ఆర్కెస్ట్రా) మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయనీ. గ్రామ ప్రజల ఐకమత్యం, భక్తి, సేవా భావం అన్ని కలగలసి ఈ మహోత్సవాన్ని మరింత వైభవోపేతంగా నిలబెట్టాయన్నారు. ఈ సందర్భంగా ఆడపిల్లలు మా వేంపెంట గ్రామానికి వచ్చి వడిబియ్యం పోసుకోవడం, ప్రతి ఇల్లు ఆడపిల్లలతో, బంధువులతో ఊరంతా కోలాహలంగా కళకళలాడటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయిందన్నారు. దేవాలయం కోసం ఎంతో శ్రమించి, తన జీవితంలో ఒక లక్ష్యంగా భావించిన మా నాన్న కృష్ణుడు స్మృతికి ఈ మహోత్సవం ఒక శాశ్వత నివాళిగా నిలిచిపోతుందన్నారు. ఈ మహోత్సవం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన గ్రామ పెద్దలు, దాతలు, భక్తులు, యువత, మహిళలు మరియు సేవకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. మీ అందరి సహకారం, సమర్పణ భావం మరియు భక్తి వల్లే ఈ మహోత్సవం ఘనవిజయం సాధించిందనీ అన్నారు. అలాగే, ఏవైనా కారణాల వల్ల ఈ మహోత్సవం నిర్వహణకు ఆటంకం కలగాలని లేదా ఆపాలని ప్రయత్నించిన వారిని కూడా భగవంతుడు సద్బుద్ధితో అనుగ్రహించి, వారి తప్పులను క్షమించాలని ప్రార్థిస్తున్నాను. ఈ దేవాలయ పునర్ ప్రతిష్టా కార్యక్రమానికి వచ్చిన వారందరికీ శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామివారి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరోసారి ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :