Monday, 14 September 2026 05:42:36 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్

Date : 01 June 2026 10:16 PM Views : 152

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో ఈరోజు జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని, కొత్తగా మంజూరైన పింఛన్ ముంతమ్మ బాయి కి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కంభం మోహన్ గౌడ్ గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులైన వృద్ధుల, వితంతువుల, దివ్యాంగుల, బెడ్ పేషెంట్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీనే మా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, సమయపాలనతో పెన్షన్లను నేరుగా ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు అందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది ఖాసీం, టిడిపి నాయకులు గంటా రమేష్, ధర్మవరం మల్లికార్జున నాయుడు, మాజీ సర్పంచ్ వెంకటసుబ్బమ్మ, శంకర్ రాములు నాయక్, మద్దూరు వెంకటస్వామి, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :