ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో కర్నూలు అమీలియా హాస్పిటల్ వారి సౌజన్యంతో మమత పాలి క్లినిక్ & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాజు, కుటుంబ సభ్యులు ఎం.రాధమ్మ, బిహెచ్ఎంఎస్ & సి సి ఎం డాక్టర్ ఎం.రాజేష్, ఎంబిబిఎస్ డాక్టర్ ఎం.మమత ల ఆధ్వర్యంలో నిర్వహించిన 444వ ఉచిత వైద్య శిబిరానికి ప్రజల విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఐ ఆర్ సి ఎస్ పాములపాడు మండల అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాజు, మమత పాలిక్ క్లినిక్ ఎంబిబిఎస్ డాక్టర్ ఎం.మమత, బిహెచ్ఎంఎస్ & సీసీఎం డాక్టర్ ఎం.రాజేష్ లు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో అమీలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సి.లక్ష్మీప్రసాద్, వారి వైద్య సిబ్బంది సహకారంతో కంటి శుక్లము, గుండె జబ్బులు, గర్భిణీ స్త్రీలు, బిపి,షుగర్ ఉన్నవాళ్లు, మోకాళ్ళ నొప్పులు, వరిబీజము, హెర్నియా, చెవి ముక్కు సమస్యలు గల రోగులకు మరియు అత్యంత ఖరీదైన గుండె పరీక్షల 2డి ఏకో, ఈసీజీ, ఆర్ బి ఎస్, హెచ్ బి శాతం, బిపి చెకప్, కంటి చెకప్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. నయం కానీ జబ్బులకు కర్నూలు అమీలియా హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. మమత పాలి క్లినిక్ డాక్టర్ ఎం.రాజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు, ప్రజలందరికీ, కర్నూలు వైద్య సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు అమీలియా హాస్పిటల్ డాక్టర్ రామ్మోహన్ నాయుడు, డాక్టర్ గణేష్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనిజారితీ, కే.వరప్రసాద్, 2డి ఏకో నిపుణులు ఎస్.సోమన్న, అమీలియా హాస్పిటల్ వైద్య సిబ్బంది, సోషల్ మీడియా ప్రతినిధి కే.సాయి కృష్ణ, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News