ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/మహానంది : నంద్యాల జిల్లాలోని, మహానంది నందీశ్వరాలయం దగ్గర మహాశివరాత్రిని పురస్కరించుకొని రజక సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు పాల్గొని, భక్తులకు భోజనం వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా గొప్పదానం ఈ అన్నదాన కార్యక్రమం అని అన్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ రజక సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకార అందించిన దాతలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు నరసింహులు, సి.ధర్మయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి పెద్ద వచ్చిన భక్తులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News