ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నాబార్డ్ వారి సౌజన్యంతో ఎఫ్ ఐ ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాసత సదస్సు ఆత్మకూరు సొసైటీ బ్యాంకు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్, ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, విఆర్ఎస్ పి చైర్మన్ పి.మల్లికార్జున రెడ్డితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమకు అలవాటు చేసుకోవాలని, నాబార్డ్ ద్వారా సబ్సిడీ లోన్లను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ కొమ్మపాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు, ప్రజలు సైబర్ నెరగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని, గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా గాని, సొసైటీ బ్యాంకుల ద్వారా గాని లావాదేవీలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటం.రామిరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి బి.ముర్తుజా, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి అలీ హుస్సేన్, రైతులు మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, రైతు సంఘ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News