Tuesday, 15 September 2026 01:32:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోనీ పర్యావరణాన్ని కాపాడాలి

జి .నాగముని(ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్), మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి

Date : 16 November 2025 08:40 AM Views : 201

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూల్ పట్టణంలోని, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటుచేసిన స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి లు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిసరాల పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిపారు. అపరిశుభ్రత వల్ల వాయు కాలుష్యం మరియు గుండె,రక్త ప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. గాలిలోని సూక్ష్మ కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయన్నారు. దీనివల్ల గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అలాగే పట్టణంలో పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహణ కల్పిస్తూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు, మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలందరు ఆరోగ్యం,కాలుష్యం పై అవగాహణ కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ ను నిరోధించాలనీ, ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలన్నారు. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ - ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. విద్యార్థులు కూడా మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా మంచి పనులు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కేంద్రీయ విద్యాలయం ఆవరణలో తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతానని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తమ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం స్వచ్చంద్ర స్వచ్ఛ దివస్ గురించి విద్యార్థులతో, అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, ఓర్వకల్ మండల కన్వీనర్ నాగిరెడ్డి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు శ్రీకాంత్, వీరేంద్ర ,అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :