Wednesday, 29 July 2026 06:30:01 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వ్యవసాయానికి పగలే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఏడి కి వినతి పత్రం సమర్పించిన ఏపీ రైతు సంఘం నాయకులు

Date : 15 July 2026 08:54 PM Views : 186

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు, కొత్తపల్లె, పాములపాడు మండలాలలో వ్యవసాయానికి పగలే 9 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడి ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ.రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ మే నెలలో కురిసిన వర్షాల వల్ల ముందస్తు వ్యవసాయం చేసి మొక్కజొన్న ,పత్తి, వరి, మిర్చి కూరగాయలు తదితర పంటలు వేశారనీ జూన్, జూలై నెలలో వర్షాలు ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో, తీవ్రమైన ఎండలకు పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత రెండు సంవత్సరాలు పంటలు సరిగా రాక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొనుగోలు చేయనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సంవత్సరం ఖరీఫ్ లో పాత అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేసి ఎంతో ఆశతో ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురవుతుందన్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటితో పంటలు కాపాడుకుందాం అంటే కరెంటు సక్రమంగా ఉండకపోవడం వల్ల ఉన్న నీటిని పంటలకు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఎలక్ట్రికల్ అధికారులు నాణ్యమైన కరెంటును పగలే 9 గంటలు కరెంటు అందివ్వాలని, గృహ అవసరాలతో సంబంధం లేకుండా, వ్యవసాయానికి ప్రత్యేక లైన్ల ద్వారా కరెంటు అందించాలని ఎలక్ట్రికల్ ఏడి ని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆత్మకూరు ఎలక్ట్రికల్ ఏడీ మాట్లాడుతూ పగలే 9 గంటల కరెంటును సప్లై చేస్తామని లైన్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి, రైతులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యం.వీరన్న పండ్ల తోటల రైతు సంఘం అధ్యక్షుడు ఏం.మహబూబ్ బాషా, బాల యేసు, అంబయ్య, జమాల్ ఖాన్, రాజమ్మద్ రబ్బాని, బి.హిదాయతుల్లా, ఏసన్న, రంగస్వామి, దేవకుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :