ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు మండలంలోని, వేల్పనూరు ఎమ్మెల్యే ఇంటి వద్ద మృతి చెందిన టిడిపి కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం, భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయం.ఇటీవల ప్రమాదవశాత్తు ఆత్మకూరు పట్టణం గరీబ్ నగర్ కు చెందిన టిడిపి కార్యకర్త సయ్యద్ షఫీవుల్లా వలి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే చొరవ తీసుకొని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరు చేయించి కుటుంబ సభ్యులను పరామర్శించి, బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరుకు చెందిన టిడిపి నాయకులు మరియు సయ్యద్ షఫీఉల్లా అలీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News