Thursday, 30 July 2026 04:16:41 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నిబంధ‌న‌ల మేర‌కు జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్..! జీవోఎంఎస్ నెం.84 ప్ర‌కారం జిల్లాలో తొలి విడ‌త 742 కార్డుల జారీ

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 20 February 2026 06:22 AM Views : 126

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను అనుస‌రించి జిల్లాలో అర్హత ప్రమాణాలున్న జర్నలిస్టుల‌కు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామ‌ని, తొలి విడ‌త 742 కార్డుల‌ను జారీచేసి, పంపిణీ చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా మీడియా అక్రెడిటేష‌న్ క‌మిటీ (డీఎంఏసీ) ఛైర్మ‌న్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు మంజూరైన అక్రెడిటేష‌న్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల అక్రెడిటేష‌న్ కార్డుల కాల‌ప‌రిమితి పూర్త‌యినందున నూత‌న అక్రెడిటేష‌న్ కార్డుల మంజూరుకు జీవోఎంఎస్ నెం.84లోని నిబంధనలు, మార్గదర్శకాల మేర‌కు జిల్లాస్థాయి క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు అక్రెడిటేష‌న్ కార్డుల కోసం జ‌ర్న‌లిస్టులు చేసుకున్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తొలి విడతగా 742 అక్రెడిటేషన్ కార్డులు జారీకి డీఎంఏసీ ఆమోదం తెలిపింద‌న్నారు. అక్రెడిటేష‌న్ మంజూరైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రెడిటేష‌న్ కార్డుల‌ను పంప‌ణీ చేస్తున్నామ‌ని 2027, డిసెంబ‌ర్ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. ప్రతి దరఖాస్తును నిష్పాక్షికంగా పార‌ద‌ర్శ‌కంగా పరిశీలించి, అర్హత ఉన్న వారికి కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి త్వరలోనే తదుపరి విడతలో కార్డులు జారీచేస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మ‌ధ్య వార‌ధిలా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల వివరాలను చేర‌వేయ‌డంలో మీడియా పాత్ర కీల‌క‌మైంద‌న్నారు. జిల్లా అభివృద్ధిలో ప్ర‌భుత్వ యంత్రాంగానికి సూచ‌న‌లు స‌ల‌హాలు అందిస్తూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌లు అందించ‌డంలో స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు. ఈ అక్రెడిటేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మంలో డీఐపీఆర్‌వో కేవీ ర‌మ‌ణ‌రావు, డివిజ‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ఆడియో విజువ‌ల్ ప‌ర్య‌వేక్ష‌కులు వి.వి.ప్ర‌సాద్, డీమ్యాక్ స‌భ్యులు, ఉప కార్మిక కమిషనర్ జి.ధనలక్ష్మి, పి.నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు, క‌లిమిశ్రీ, యామినేని వెంక‌ట ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: