ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : ఓర్వకల్లు మండలంలోని, కాల్వబుగ్గ గ్రామంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న 16 గదుల నిర్మాణ పనులకు పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే & టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి మరియు టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని లతో కలిసి భూమిపూజ చేశారు. బుగ్గ రామేశ్వరస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.45 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వారు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నాగిరెడ్డి, హుస్సేనాపురం లక్ష్మణరావు, సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సంజీవ రామ్ రెడ్డి, సుధాకర్, నాగేశ్వర్ రెడ్డి వివిధ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొని, విజయవంతం చేశారు.
Admin
E Nivas News