ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లి మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారి సంయుక్త అద్వర్యంలో సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతు శిక్షణా కార్యక్రమం ఆత్మకూరు మండలంలోని, నల్లకాల్వ గ్రామంలో కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ పచ్చిరొట్టె పైర్లు, పంట మార్పిడి చేసుకొని నేల సారవంతం పెంచుకోవాలని సూచించారు. ఇందులో కేవీకే సస్య రక్షణ శాస్త్రవేత్త బాలరాజు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయ విధానాలైన నవధాన్యాల సాగు, పంట అవశేషాలు కలియదున్నడం, జీవన ఎరువులు, జీవ క్రీమి నాసినులు విరివిగా వాడటం వంటి పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ అధికారి పాల్గొని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, భూసారా అదారిత ఎరువులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కేవీకే శాస్త్రవేత్తలు బాలరాజు, రవిగౌడ్, మండల వ్యవసాయ అధికారి- కె.హేమలత, గ్రామ వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News