Saturday, 13 June 2026 01:11:15 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఆత్మకూరు జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్లు, డైరీలు ఆవిష్కరణ

Date : 23 January 2026 09:05 AM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ అడవి సంపద, పెద్ద పులుల సంరక్షణతో పాటు పర్యావరణం కాపాడుతూ విధి నిర్వహణలో ముందుకెళ్తున్న ఎఫ్బి ఓ, ఏపీఓ లకు, ప్రజల్లో అరుదైన గౌరవం ఉండే విధంగా ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావో తో గురువారం పట్టణంలోని, వన్యప్రాణి డివిజన్ కార్యాలయంలో ఆత్మకూరు జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం నూతన క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ముందుగా అటవీశాఖ బీట్ అధికారులకు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లకు, పిక్ క్యాప్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ అటవీ శాఖలో 1989 సంవత్సరంలో జీవో నెంబర్-10551/ఐ వి/98-1 అమలు చేయడం డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావో కి సాధ్యమైందని తెలియజేశారు. అటవీ శాఖలో ప్రతి ఉద్యోగి యూనిఫామ్ దుస్తులను ధరించి ప్రజల్లో ఉంటే అరుదైన గౌరవం అటవీశాఖ ఉద్యోగులకు వస్తుందని వివరించారు. అటవీశాఖ ఉద్యోగుల సమస్యలపై పరిష్కరిస్తూ విధి నిర్వహణలో అన్ని విధాలుగా అటవీశాఖ సిబ్బందికి తోడ్పాటు అందిస్తున్న ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావో కి, ఆత్మకూరు జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరి వెంట జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్- సయ్యద్ పీరా, సెక్రెటరీ- ఎస్.జెడ్. తాహిర్ అహ్మద్, ఆర్గనైజర్ సెక్రెటరీ- కావేరి, జాయింట్ సెక్రెటరీ- తమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్- ఆబిదా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :