ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ కార్యాలయం దగ్గర 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాక్టర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జీ.నాగముని జాతీయ మువ్వన్నెల జెండాను ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ జెండాకు కార్యాలయ ఉద్యోగస్తులతో కలిసి గౌరవ వందనం సమర్పించి, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడిసి కార్యాలయం ఈఈ - లక్ష్మీనారాయణ డిప్యూటీ ఈఈ-గోన.నాగరాజు, సైట్ ఇంజనీర్లు సూపర్డెంట్ వెంగన్న, ఆఫీస్ సిబ్బంది నవీన్, రవికుమార్, మాధవ్, కృష్ణ, జలీల్ భాషా, మరి కొంతమంది నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News