ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను, దేశానికి ఆయన అందించిన సేవలను, విద్యారంగంలో ఆయన చేసిన కృషిని వివరించారు. విద్య విలువలు, గురువు–విద్యార్థి సంబంధం, క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యార్థుల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర వంటి అంశాలపై ప్రసంగాలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు మరియు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్. గోపాల్ మాట్లాడుతూ ఒక మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, దేశభక్తి వంటి లక్షణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు, విద్యార్థుల భవిష్యత్తుకు రూపశిల్పులు అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. విద్యార్థులు నైతిక విలువలు అనే స్కిట్ పై అద్భుతంగా అభినయించారు. శ్రీ వివేకానంద విద్యావిహర్ పాఠశాలలో 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న సురేంద్ర. బాలకృష్ణమ్మ షాజహాన్ జయ లక్ష్మమ్మ లకు ప్రత్యేక మెమెంటులు, ప్రశంస పత్రాలు బహుమతుల్ని అందజేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద విద్యా విహార్ పాఠశాల డైరెక్టర్ రాయపాటి దేవిక, అడ్మినిస్ట్రేటర్ బాలకృష్ణమ్మ, కల్చరల్ ఇన్ ఛార్జ్ షాజహాన్. ఉపాధ్యాయులు, సురేంద్ర, హబీబుల్లా, తిరుమలేష్, జయలక్ష్మి, స్రవంతి, పుష్ప చంద్రకళ, మైత్రి, ప్రియ, గాయత్రీ, భారతి, మల్లిక, రాణి, కళిమున్ బి, శ్రీ లక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News