Monday, 14 September 2026 06:35:17 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పాలక ప్రభుత్వాలు

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్

Date : 27 January 2026 10:54 PM Views : 188

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్న నెమలి వెంకట్ రెడ్డి భవన్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సమావేశం టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి- టి.రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తుందని బిజెపి సిద్ధాంతాలను ప్రోత్సాహంచేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని విద్యుత్ కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలపై పన్నుల బరాలు మోపుతూ పెత్తనం చెలాయిస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, వికసిత్ భారత్ జిరాంజీ పార్లమెంట్లో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం నిధుల వాటాను 90 శాతం ఉన్న వాటను 60% కుదించి రాష్ట్రాల వాటా 10 శాతం ఉంటే, 40 శాతానికి పెంచి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు ఇతర వృత్తిదారులకు వ్యవసాయ కూలీలకు ఈ చట్టం వరం లాంటిదని ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని అలాంటి చట్టాన్ని పేరు మార్పు చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళలకు సమాన పని సమాన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలోగ్గి కొత్త చట్టాలు అమలు పేరుతో విత్తన చట్టాన్ని విదేశీ కంపెనీల చేతులలో పెడుతూ ఈ దేశ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. లేబర్ కోడ్ పేరుతో 29 రకాల కార్మిక హక్కుల చట్టాలను నాశనం చేస్తు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. దేశంలో పరిస్థితులను చూస్తుంటే ప్రశ్నించే వారిని అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేయడం లాంటి చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒడిగట్టడం దుర్మార్గమన్నారు. దేశంలో రెండే ఐడియాలజీలు ఉన్నాయని ఒకటి పెట్టుబడి విధానం కాగా మరొకటి సోషలిజం అని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కార్మికులు పేదల పక్షాన ప్రశ్నించే సత్తా కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతుల్ని, కార్మికులను, కర్షకులను ఉపాది కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, ఏం.రాజు, ఎస్.బాలయ్య, బాల యేసు, బి.రమణమ్మ, అంజలి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :