ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : ఓర్వకల్లు విమానాశ్రయం ప్రాంతంలో ఉన్న, డాక్టర్ అబ్దుల్ హఖ్ ఉర్దూ యూనివర్సిటీలో నిలిచిపోయిన పనులను ముఖ్య అతిధులు రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు.చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఉర్దూ యూనివర్సిటీ నిరుపయోగంగా మారిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మంత్రి టీజీ.భరత్ కోటి రూపాయల నిధులను మంజూరు చేశారు. ఇందుకు ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మంత్రి టీజీ. భరత్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నిధులతో యూనివర్సిటీ పనులను తిరిగి ప్రారంభించి, కూటమి ప్రభుత్వంలోనే యూనివర్సిటీ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, యూనివర్సిటీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News