ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంఘం (ఎస్టిటిఎఫ్)-2026 నూతన క్యాలెండర్లను ఆత్మకూరు పట్టణంలోని, విద్యా వనరుల కేంద్రం(ఎం ఆర్ సి)లో శనివారం నాడు ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారి-2 ఎం.అయూబ్ అహమ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ-2 ఎం. ఆయుబ్ అహ్మద్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం,ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. అనంతరం ఆయనకు ఉపాధ్యాయులందరూ కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నాయక్, రాంబాలాజీ నాయక్, మురళీనాయక్, బాలాజీ నాయక్, శోభన్ బాబు నాయక్, శేఖర్ నాయక్, రాజానాయక్, పుల్లన్న, హనుమంతు నాయక్, ఈశ్వర్ నాయక్, శివ శంకర్ నాయక్, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు నాయక్, పద్మలత, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News