Wednesday, 29 July 2026 10:13:38 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పి4 క్రింద పేదల కోసం సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు నిర్మించిన నూతన గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

వేంపెంట గ్రామంలో హెల్త్ సెంటర్ ను, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 28 April 2026 05:32 AM Views : 108

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, బానకచర్ల గ్రామంలో సుంకుల.రామలింగమ్మ, సుంకుల.రామారావు ల పేద కుటుంబానికి 3 లక్షల రూపాయల నిధులతో పి4 (పబ్లిక్-ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్) క్రింద బంగారు మార్గదర్శకులు అంతర్జాతీయ సమాజ సేవకుడు & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు నిర్మించిన నూతన గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని, దాత కుటుంబ సభ్యులతో కలిసి నందికొట్కూరు నియోజవర్గం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, గృహాన్ని రిబ్బన్ కటింగ్ చేసి, ఘనంగా ప్రారంభించడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కు బంగారు మార్గదర్శి సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, ఆమె తల్లి వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా చెప్పుకొనే పి4 ద్వారా నియోజకవర్గంలో బంగారు కుటుంబాలుగా గుర్తించబడిన వ్యక్తులు, వారి పరిసర ప్రాంతాలలో నిరుపేదలైన వ్యక్తులను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలపడం జరిగింది. అలాగే కార్యక్రమంలో లబ్దిదారులైన సుంకుల. రామారావు మాట్లాడుతూ గ్రామంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న నా కుటుంబాన్ని గుర్తించి, మాకు నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు కి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, అంతర్జాతీయ సమాజం & హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు లకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానించడం జరిగింది. వేంపెంట గ్రామంలో హెల్త్ సెంటర్ ను, సిసి రోడ్లను ప్రభుత్వ అధికారులతో,నాయకులతో కలిసి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ప్రారంభించడం జరిగింది. బానకచర్ల, వేంపెంట గ్రామాల కార్యక్రమాల అనంతరము నందికొట్కూరు నుండి వచ్చిన నాయకులకు, మండలంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ, మండల నాయకులకు, గ్రామాల నాయకులను, వచ్చిన వారందరికీ సింగపూర్ డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు విందు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, తహసిల్దార్- జి.సుభద్రమ్మ, ఎస్సై- పి.తిరుపాలు, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, పిహెచ్సి వైద్యాధికారిణి ఇ.వి.నాగలక్ష్మి దేవి, డిటి-పఠాన్ బాబు, ఉపాధి హామీ ఏపీఓ- జయంతి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ-ఎస్.సువచ్చల, పిఆర్ జెఈ- బి.వి.ఎన్.రాఘవేంద్రప్రసాద్, మండల కన్వీనర్- జీ.రవీంద్ర రెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, శేఖర్, హరీనాథ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వెంకటేష్ రెడ్డి, రాము, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్ కరీం బాషా, రుద్రవరం సురేష్, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మిరెడ్డి, జూటూరు నాయిని మధు, పూసల కృష్ణ, మల్లీశ్వరరెడ్డి, పీఏ-మద్దిలేటి, హెల్త్ సూపర్వైజర్ మల్లికార్జున, హెల్త్ సిబ్బంది హరికృష్ణ, పుల్లయ్య, వేంపెంట నాయకులు, ఎంపీటీసీ బోనాల నాగ లక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేశ్, వేమా రెడ్డి, రమేష్ రెడ్డి, రత్నాకర్, చిన్నస్వామి ఆచారి, బాలకృష్ణ, కిరణ్, యెర్రసాని రాము, కుటుంబరావు, బోనాల భాస్కర్, చిరంజీవి గౌడ్, మధుసూదన్ గౌడ్, సుంకన్న, నెంబర్ లక్ష్మన్న, గాండ్ల.సుబ్బారావు, ముద్దపాటి ప్రసాద్, రాముడు, నాగేశ్వర నాయక్, రామచంద్రుడు, నారాయణ, చిన్న హుస్సన్నయ్య, సిరిగిరి ప్రసాద్, మద్దూరు ప్రసాద్, నులక చంద్ర, జనసేన శేషు, శ్రీధర్, ఎల్లసుబ్బడు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: